ఇండియాలో మా కంపెనీలు పెట్టాలని చూస్తున్నా:ఎలాన్ మస్క్ 

మోదీకి కంగ్రాట్స్: ఎలాన్ మస్క్

న్యూయార్క్: మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీకి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కంగ్రాట్స్ చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌‌లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి నందుకు మోదీకి అభినందనలు తెలియజేశారు. భారత్‌‌లో తమ కంపెనీలను ఏర్పాటు చేసి, అద్భు తాలు సృష్టించాలని ఎంతో ఆసక్తిగా  ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.

2023 జూన్‌‌లో మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఎలాన్ మస్క్‌‌ను కలిశారు. ఆయనతో పలు విషయాల గురించి చర్చించారు. అయితే.. 2024లో మస్క్ ఇండియా కు వస్తున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు. మ‌‌స్క్ ఈ ఏడాది ఏప్రిల్ 21, 22 తేదీల్లో మోదీని కలవాల్సిన షెడ్యూల్‌‌ను రద్దు చేసుకున్నారు. తాజా ట్వీట్‌‌తో త్వరలోనే మస్క్ ఇండియాకు వచ్చి తన కంపెనీ లు టెస్లా, స్టార్ లింక్ వంటివి ఇక్కడ పనిచేసే విధంగా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా..ఎన్డీయే పక్షనేతగా మోదీని కూటమి బలపరిచింది. దీంతో ఆయన ఆదివారం ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయ‌‌నున్నారు.